ఎప్పుడే బుద్ధి పుట్టునో యెరగరాదు
దెప్పరపుమాబ్రదుకు దేవునికే సెలవు
యేడనుండి పుట్టితిమో యింతక తొల్లి యింక
నేడక బోయెదమో యిటమీదను
వీడని మాయంతరాత్మ విష్ణుడు మా-
జాడ జన్మమతనికే సమర్పణము
గతచన్న పితరు లక్కడ నెవ్వరో
హితవై యిప్పటి పుత్రు లిదియెవ్వరో
మతి మా జీవనమెల్ల మాధవుడు
అతనికే మా భోగాలన్నియు సమర్పణము
తొడికి స్వర్గాదులు తొల్లియాడవో యీ-
నడచే ప్రపంచము నాకేడదో
కడగి శ్రీ వేంకటేశు గతియే మాది
అడగు మాపుణ్య పాపా లతని కర్పణము
http://www.esnips.com/doc/3ff064ca-55b0-4c73-abcc-392617779273/YEPPUDE
eppuDE buddhi puTTunO yeragarAdu
depparapumAbraduku dEvunikE selavu
yEDanuMDi puTTitimO yiMtaka tolli yiMka
nEDaka bOyedamO yiTamIdanu
vIDani mAyaMtarAtma viShNuDu mA-
jADa janmamatanikE samarpaNamu
gatacanna pitaru lakkaDa nevvarO
hitavai yippaTi putru lidiyevvarO
mati mA jIvanamella mAdhavuDu
atanikE mA bhOgAlanniyu samarpaNamu
toDiki svargAdulu tolliyADavO yI-
naDacE prapaMcamu nAkEDadO
kaDagi SrI vEMkaTESu gatiyE mAdi
aDagu mApuNya pApA latani karpaNamu
No comments:
Post a Comment