ఈ సొబగు లెచట గల వీపె యందే కాక
వాసివంతుల నీకెను వర్ణింప వసమా
అతివ పద్మినిగనక యలికుంతలి యనదగు
సితచంద్రముఖిగాన జిగి జకోరాక్షి యగు
తతి బువ్వుబోడిగన తగులు బికవాణి యన
చతురబిసహస్తగన శంఖగళ యగును
హరిమధ్యగన చెలియ ద్రికుచ యనదగును
గరిమ నాభి సరసిగన వళితరంగ యగు
వురుచక్రజఘనగన యూరుయుగ యవదగును
గురుహంసయానగన కూర్మపద యగును
కలిత కనకాంగిగన కాంతమణినఖ యగును
జలధి గంభీరగన సరసామృతాదర యగు
యెలమి శ్రీ వేంకటేశు డెనసెగన సిరియగును
కలిత శ్రంగారగన కల్యాణి యగును
http://www.esnips.com/doc/d12151c0-c1de-4922-a713-142ce941c872/EE-SOBHAGULECATAGALAV
I sobagu lecaTa gala vIpe yaMdE kAka
vAsivaMtula nIkenu varNiMpa vasamA
ativa padminiganaka yalikuMtali yanadagu
sitacaMdramukhigAna jigi jakOrAkShi yagu
tati buvvubODigana tagulu bikavANi yana
caturabisahastagana SaMkhagaLa yagunu
harimadhyagana celiya drikuca yanadagunu
garima nAbhi sarasigana vaLitaraMga yagu
vurucakrajaghanagana yUruyuga yavadagunu
guruhaMsayAnagana kUrmapada yagunu
kalita kanakAMgigana kAMtamaNinakha yagunu
jaladhi gaMbhIragana sarasAmRtAdara yagu
yelami SrI vEMkaTESu Denasegana siriyagunu
kalita SrMgAragana kalyANi yagunu
No comments:
Post a Comment