కానీవే గొల్లెతా గబ్బిగొల్లెతా
ఆనుక తెలెసుకొంటి వవునవురా గొల్లడా
పంతకారి గొల్లెతా పదరకు గొల్లెతా
రంతుల నట్టేకానీరా గొల్లడా
యింతగట్టి వాయవౌత యెరిగితినే నేను
సంతలోనె వింటిరా నీసాదుదనానెల్లను
మతకారి గొల్లెతా మంకులాడిగొల్లెతా
రతులకు మాయింటికి రారా గొల్లడా
కతకారివౌత ఇట్టే గానవచ్చెనే నేడు
చతురతలు మోమున జడిసేరా నీకును
చనవరి గొల్లెతా చనవిమ్మా గొల్లెతా
కెలయకు శ్రీ వేంకటాగిరి గొల్లడా
పొలతు లందరు నేడూ పొగడేరే నిన్నును
కలపితి వౌట నిన్ను కమ్మటి మెచ్చితిని
http://www.esnips.com/doc/213b2d71-47fb-4c79-8bdb-37f1b33b6286/KANIVE-GOLLITA
kAnIvE golletA gabbigolletA
Anuka telesukoMTi vavunavurA gollaDA
paMtakAri golletA padaraku golletA
raMtula naTTEkAnIrA gollaDA
yiMtagaTTi vAyavauta yerigitinE nEnu
saMtalOne viMTirA nIsAdudanAnellanu
matakAri golletA maMkulADigolletA
ratulaku mAyiMTiki rArA gollaDA
katakArivauta iTTE gAnavaccenE nEDu
caturatalu mOmuna jaDisErA nIkunu
canavari golletA canavimmA golletA
kelayaku SrI vEMkaTAgiri gollaDA
polatu laMdaru nEDU pogaDErE ninnunu
kalapiti vauTa ninnu kammaTi meccitini
No comments:
Post a Comment