వద్దే గొల్లెత వదలకువే-నీ-
ముద్దు మాటలకు మొక్కేమయ్యా
యేలే యేలే యేలే గొల్లెత
నాలాగెరగవా నన్ను నే చేవు
చాలుజాలు నికజాలు నీరచనలు
పోలవు బొంకులు పోవయ్యా
కానీ కానీ కానిలే గొల్లెత
పోనీలే నీవెందు వోయినను
మాని మాని పలుమారు జెనుకుచు మా-
తోనిటు సొలయక తొలవయ్యా
రావా రావా రావా గొల్లెత
శ్రీ వేంకటగిరి చెలువుడను
నీవె నీవె నను నించితి కౌగిట
కైవశమైతిని గదవయ్యా
http://www.esnips.com/doc/77327214-7959-4d4f-a175-93f9f97b4f8c/VODDE-GOLLETHA
http://www.4shared.com/audio/20u8nVIV/03-Vadde_Golleta-BMK_SGR.html
vaddE golleta vadalakuvE-nI-
muddu mATalaku mokkEmayyA
yElE yElE yElE golleta
nAlAgeragavA nannu nE cEvu
cAlujAlu nikajAlu nIracanalu
pOlavu boMkulu pOvayyA
kAnI kAnI kAnilE golleta
pOnIlE nIveMdu vOyinanu
mAni mAni palumAru jenukucu mA-
tOniTu solayaka tolavayyA
rAvA rAvA rAvA golleta
SrI vEMkaTagiri celuvuDanu
nIve nIve nanu niMciti kaugiTa
kaivaSamaitini gadavayyA
No comments:
Post a Comment